కృత్రిమ దంతాలకు చెక్..! పెద్దల్లో కూడా ఊడిన దంతాల పునరుత్పత్తి..!!

మనిషికి బాహ్య సౌందర్యం ఎంతో ముఖ్యం. అందులో ఎదుటివారిని ఆకర్షించే వాటిలో దంత సౌందర్యం కూడా ఒకటి. మాట్లాడినా, నవ్వినా ఎదుటి వాళ్లను ఆకర్షిస్తాయి. పళ్ల వరుస బాగుంటే తోటివారి మధ్య ఉన్నప్పుడు మనలో అసౌకర్యం ఉండదు. అయితే.. దంతాలు చిన్నప్పుడు ఊడిపోయి మళ్లీ వస్తాయి. ఆ సమయంలోనే అసలైన పళ్ల వరుస వస్తుంది. అయితే.. పిల్లలకు దంతాలు ఊడిపోతే వస్తాయి. కానీ.. పెద్దలకు అలాంటి సౌకర్యం లేదు. పెద్దవారికి దంతాలు ఒకసారి ఊడిపోతే మళ్లీ రావు. కానీ.. మళ్లీ వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.

జన్యు చికిత్స ద్వారా పెద్దవాళ్లకు ఊడిపోయిన పళ్ల స్థానంలో కొత్తవి వచ్చే అవకాశం ఉందంటున్నారు. జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయం, ఫుకుయ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈమేరకు కొత్తగా పళ్లను పునరుత్పత్తి చేయొచ్చని అంటున్నారు. వారే ఈ సరికొత్త చికిత్సను కనుగొన్నారు. ఈ చికిత్సతో పెద్దల్లో ఊడిపోయిన దంతాలను మళ్లీ పుట్టించవచ్చని అంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు సైన్స్ అడ్వాన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ చికిత్సను ఎలుకలు, ఫెర్రెట్స్ మీద ప్రయోగించి సక్సెస్ అయినట్టు చెప్తున్నారు. వాటిలో ఊడిన దంతాలు మళ్లీ పునరుత్పత్తి కావడంతో మానవుల్లో కూడా సాధ్యమని అంటున్నారు.

ఎలుకలు, పెర్రెట్స్‌ దంతాలు కూడా మనుషుల దంత నిర్మాణం తరహాలోనే ఉంటుంది కాబట్టే వాటి మీద ప్రయాగాలు చేసినట్టు చెప్తున్నారు. పళ్ల చిగుళ్లలో సూక్ష్మక్రిముల అభివృద్ధిని నిరోధించడం ద్వారా USAG-1 దంతాల సంఖ్యను నియంత్రిస్తుందని తమ ఫలితాల్లో తేలిందని అంటున్నారు. మొత్తంగా జన్యు చికిత్స సక్సెస్ కావడంతో పెద్దల్లో ఊడిపోయిన దంతాలు పునరుత్పత్తి చేయొచ్చని.. కృత్రిమ దంతాల అవసరం లేకుండా చేయొచ్చంటున్నారు. దంత సమస్యలను కూడా పరిష్కరించొచ్చని అంటున్నారు. అందుకు ఇంకొన్ని ప్రయోగాలు, పరిశోధనలు చేయాల్సి ఉందని అంటున్నారు.

 

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యం పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వైద్యులను కలిసి చికిత్స తసుకోవాలని.. సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాం.