తగ్గిన పోలింగ్ : ఎవరికీ అనుకూలం కానుంది..? గెలిచేది ఎవరంటే..?

ghmc elections

 గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసిపోయింది. అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఇబ్బందులు లేకుండా పోలింగ్ ముగిసింది. కానీ ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. అధికారికంగా వచ్చిన లెక్కలు ప్రకారం గ్రేటర్ పరిధిలో 45. 97 శాతానికి మించి పోలింగ్ జరగలేదని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో కనీసం 50 నుండి 60 శాతం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని అనుకున్నారు, కానీ ఆ మార్క్ ను అందుకోలేకపోయింది.

ghmc elections

 ఇక పోలింగ్ శాతం తక్కువ కావటం మూలంగా అది ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో, ఎవరికీ ప్రతికూలంగా మారుతుందో అనే చర్చలు మొదలైయ్యాయి. సాధార‌ణంగా పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీకి అనుకూలం కాదు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ప్ర‌భుత్వాల మీద వ్య‌తిరేక‌త పెరిగిన‌ప్పుడే.. ఎక్కువ శాతం పోలింగ్ న‌మోద‌వుతుంది అనేది ఒక నిశ్చిత‌మైన అభిప్రాయం.
అందులోనూ బీజేపీ ప్ర‌చారాన్ని హోరెత్తించింది. ఆ పార్టీ ఢిల్లీ లీడ‌ర్ల నుంచి ప‌క్క రాష్ట్రాల గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కూ గ్రేట‌ర్ లో ప్ర‌చారం చేశారు.

 గ‌ట్టి హిందుత్వ వాదాన్ని బీజేపీ వినిపించింది. దుబ్బాక రిజ‌ల్ట్ ఉత్సాహాన్నంతా చూపించింది. అన్నింటికి మించి ఆ పార్టీ మ‌హామ‌హులంతా వ‌చ్చి వీధుల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఆ ప్ర‌భావం ఉంటే.. అది పోలింగ్ లోనే క‌నిపించేదేమో! అనే స‌న్నాయి నొక్కులు వినిపిస్తున్నాయిప్పుడు. టీఆర్ఎస్ కు చెక్ పెట్టాల‌ని గ్రేట‌ర్ ఓట‌ర్ అనుకుని ఉంటే.. పోలింగ్ ప‌ర్సెంటేజ్ క‌చ్చితంగా పెరిగేద‌ని, పోలింగ్ శాతం గ‌తాని క‌న్నా త‌గ్గిపోవ‌డం నేత‌ల‌కు బుద్ధి చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు పెద్ద ఉత్సాహం లేక‌పోవ‌డం కూడా కారణమని అంటున్నారు.

 నిజానికి ఈ పాటికే ఎగ్జిట్ పోల్స్ మార్మోగిపోయి ఉండేవి, కానీ కొన్ని చోట్ల రీ పోలింగ్ వుండటంతో వాటిని వాయిదా వేశారు. 3 వ తేదీ సాయంత్రానికి రీ పోలింగ్ ముగిస్తే, తర్వాతి రోజే అసలు ఫలితాలు రాబోతున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నకాని, పోలింగ్ శాతం తగ్గటం అనేది దారుణమైన విషయం. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో 60 నుండి 70 శాతం మధ్య పోలింగ్ జరుగుతుంటే, గ్రేటర్ పరిధిలో మాత్రం 50 శాతం మించకపోవటం బాధాకరం

ghmc poling