ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనాతో కలిసి సహజీవనం చేయాలని నిర్ణయించింది కాబట్టి ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. వచ్చే నెల నుంచి సర్కార్ ప్రభుత్వ స్కూల్స్ ఓపెనింగ్ కి రంగం సిద్దం చేస్తోంది. అలాగే పోటీ పరీక్షలకు రంగం సిద్దమవుతోంది. జీవన విధానం యధా విధిగా కొనసాగేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మళ్లీ స్థానిక ఎన్నికలకు నగరా మోగే అవకాశం కనిపిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని ఇక లైట్ తీసుకుని ముందుకు వెళ్లడానికి జగన్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఈలోపు రాష్ర్టంలో పొలిటికల్ సిచ్వేషన్స్ అన్నింటిని జగన్ తనకి అనుకూలంగా మార్చుకోవాలి.
ప్రస్తుతం అదిష్టానం అదే పనిలో ఉన్నట్లుంది. ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా క్లీస్ స్వీప్ చేయాలంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలి. జగన్ ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రొద్దుటూరు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా టీడీపీ కి దూరంగా ఉన్న వరదరాజులు రెడ్డిని వైకాపాలోకి కండువా కప్పి ఆహ్వానించడానికి పార్టీ రెడీగా ఉందిట. ఆయన కూడా ఆసక్తిగానే ఉండటంతో క్యాడర్ అంతే ఉత్సాహం చూపిస్తోందిట. రాష్ర్ట విభజన తర్వాత కాంగ్రెస్ ని వదిలి టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ టిక్కెట్ ఇచ్చినా గెలవలేదు. 2019 టిక్కెట్ ఇవ్వలేదు.ఇక సీఎం రమేష్ పలుమార్లు వదరరాజులు రెడ్డిపై నిప్పులు చెరిగిన సందర్భాలున్నాయి.
ఈ నేపథ్యంలో వరదరాజులు మనసుసు వైకాపాపై మళ్లి దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా ప్రోసస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రొద్దుటూరులో వైసీపీ విజయం సాధించాలంటే వరదరాజులు మద్దతు ఆ పార్టీకి తప్పని సరి. అందుకే ఆయన వెంట వైసీపీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారుట. అయినా వైసీపీ అదిష్టానం ఆయనకు నచ్చ జెప్పి పార్టీలోకి తీసుకోవాలని పావులు కదుపుతోందిట.