యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్ మోస్ట్ అన్ని జానర్ సినిమాలు ప్రభాస్ కవర్ చేసేసాడు. మరి ఈ లిస్ట్ లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే.
వచ్చే ఏడాది ఈ చిత్రం అత్యంత ఘనంగా రిలీజ్ అవుతుంది. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రం రిలీజ్ కి ఇంకా టైం ఉంది కానీ లేటెస్ట్ గా ప్రభాస్ రెమ్యునరేషన్ పై అనేక ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ప్రభాస్ ఏకంగా 120 కోట్లు ఛార్జ్ చేసాడు అంటూ పలు వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
అలాగే తాను అడిగిన మొత్తం కూడా ఈ చిత్ర నిర్మాతలు ఇచ్చేందుకు వెనుకాడలేదని కూడా తెలుస్తుంది. దర్శకుడే ఎప్పుడో ఈ సినిమా ప్రభాస్ లేకపోతే లేదని తేల్చి చెప్పాడు. అలాంటప్పుడు ప్రభాస్ అడిగినంత మొత్తం ఇచ్చారనడంలో కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. కాకపోతే ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.
ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముని అవతారంగా కనిపిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ జానకి దేవిగా కనిపిస్తుంది. అలాగే సైట్ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశుని పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా 3డి లో విడుదల కాబోతుంది.