kgf Chapter 2 And Salaar : ఇండస్ట్రీ టాక్ : రికార్డ్ ఫిగర్ కి అమ్ముడుపోయిన “కేజీఎఫ్ 2”, “సలార్” ఓవర్సీస్ హక్కులు?

kgf Chapter 2 And Salaar : ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ పాన్ ఇండియా లెవెల్లో అయ్యిపోయినట్టే అని మాటలు వినిపిస్తున్నాయి కానీ మున్ముందు వచ్చే సినిమాలతో మాత్రం అందరికీ గట్టి సమాధానం చెబుతాడని ప్రభాస్ అభిమానులు మాత్రం గట్టిగా చెబుతున్నారు.
అయితే ఆ సమాధానం ఇచ్చే లిస్ట్ లో కన్నడ సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి. మరి ఇప్పుడు ఈ సినిమా మరియు ఇదే దర్శకుడు చేసిన ఇంకో భారీ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” లపై ఇండస్ట్రీ వర్గాల్లో క్రేజీ టాక్ వైరల్ అవుతుంది.
ఈ రెండు సినిమాలు తాలుకా ఓవర్సీస్ బిజినెస్ థియేట్రికల్ గా ఇప్పుడు ముగిసిపోయిందట. అది కూడా నెవర్ బిఫోర్ ప్రైస్ లో అన్నట్టు తెలుస్తుంది. మరి సినీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం అయితే ఈ సినిమాలకి ఒకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏకంగా 100 కోట్లు చెల్లించి డీల్ ని క్లోజ్ చేసుకున్నారట.
ఈ రెండు సినిమాలకి ఈ రేంజ్ బిజినెస్ అంటే హ్యుజ్ అనే చెప్పాలి. ఇక కేజీఎఫ్ సినిమాలో అయితే శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా సలార్ లో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. అలాగే ఈ రెండు సినిమాలకి కూడా టోటల్ కేజీఎఫ్ టీం నే వర్క్ చేస్తుండగా హోంబలే పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా సలార్ డేట్ ఇంకా రావాల్సి ఉంది.