మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి కారణమైన సినిమా ఏదో మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వీవీ వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కి సంచలన విజయం సాధించిన సినిమాలలో ఠాగూర్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన రమణ సినిమా తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ అయింది. అయితే ఒక విధంగా ఈ సినిమా చిరంజీవి రాజశేఖర్ మధ్య గొడవకు కారణమైంది.

రమణ సినిమా హక్కులను కొనుగోలు చేయాలని హీరో రాజశేఖర్ ప్రయత్నాలు చేశారు. రమణ సినిమాకు మురుగదాస్ డైరెక్టర్ కాగా క్లైమాక్స్ ను మార్చడం ఇష్టం లేక మురుగదాస్ తెలుగు రీమేక్ ఠాగూర్ ను తెరకెక్కించే అవకాశాన్ని వదులుకున్నారు. ఇంద్ర బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి ఈ సినిమాలో నటించారు. ఇంద్రలో పాటలు సూపర్ హిట్ కాగా ఠాగూర్ లో అంతకు మించి పాటలు హిట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఎన్నో టైటిల్స్ ను పరిశీలించిన తర్వాత చివరకు ఈ సినిమాకు ఠాగూర్ అనే టైటిల్ ఫిక్స్ అయింది. క్లైమాక్స్ లో హీరో పాత్రను బ్రతికించడం వల్లే ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఈ సినిమా కోసం న్యాయ నిపుణుల సలహాలను తెలుసుకున్నారు. అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయడం గమనార్హం.

చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి ముందు నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. రీఎంట్రీలో కొత్తతరం డైరెక్టర్లకు ఓటేస్తున్న చిరంజీవి ఇప్పుడు కూడా సంచలన విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు చిరంజీవికి క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.