నాగార్జున బాలకృష్ణ కాంబో మల్టీస్టారర్ ఆగిపోవడానికి అసలు కారణమిదే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో బాలకృష్ణ నాగార్జునలకు సమాన స్థాయిలో క్రేజ్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు బాలయ్య నాగ్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ను పెంచుకున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని చాలామంది భావిస్తారు. సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ మధ్య పోటీ ఉన్నా నిజ జీవితంలో వీళ్లిద్దరూ సన్నిహితంగానే ఉండేవారు.

సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించిన సినిమాల సంఖ్య 14 కావడం గమనార్హం. ఏ పాత్రలలో నటించినా ఎన్టీఆర్ ఏఎన్నార్ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. నందమూరి బాలకృష్ణ నాగార్జున కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏఎన్నార్ కుటుంబాన్ని ఎంతో గౌరవించే హీరోలలో బాలయ్య ముందువరసలో ఉన్నారు. ఏఎన్నార్ ను బాలయ్య బాబాయ్ అని పిలిచేవారని సమాచారం.

పలు సినిమాలలో బాలయ్య, ఏఎన్నార్ కలిసి నటించగా ఆ సినిమాలు ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. నాగార్జునకు కూడా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే ఎంతో అభిమానం కాగా సీతారామరాజు సినిమాలో హరికృష్ణ, నాగార్జున కలిసి నటించారు. గుండమ్మ కథ సినిమా రీమేక్ లో బాలయ్య, నాగార్జున కలిసి నటిస్తే బాగుంటుందని అందరూ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కాంబిఏషన్ లో సినిమా పట్టాలెక్కలేదు.

బాలయ్య సైతం నాగ్ తో కలిసి నటించడానికి తాను సిద్ధమేనని తెలిపారు. క్రిస్టియన్ బ్రదర్స్ సినిమా రీమేక్ లో బాలయ్య, నాగ్ కలిసి నటిస్తే బాగుంటుందని కామెంట్లు వినిపించాయి. బెల్లంకొండ సురేష్ ఈ కాంబోలో సినిమాను నిర్మించాలని ప్రయత్నాలు చేయగా కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ సినిమా రీమేక్ హక్కులు ఇప్పటికీ బెల్లంకొండ సురేష్ దగ్గరే ఉన్నాయి.