బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి సినిమా చేయకపోవడానికి కారణాలివేనా?

కొన్ని కాంబినేషన్లలో సినిమా అంటే అభిమానులు చాలా ఆసక్తి చూపుతారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక్క సినిమా తెరకెక్కినా బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. నందమూరి అభిమానుల చిరకాల కోరిక ఇప్పట్లో నెరవేరే అవకాశాలు అయితే కనిపించడం లేదు. స్టార్ డైరెక్టర్లలో ఎవరైనా ఈ కాంబినేషన్ పై దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే బాలయ్య మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లలో జూనియర్ ఎన్టీఆర్ కే ఎక్కువగా క్రేజ్ ఉందనే సంగతి మనందరికీ తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ కు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఈ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో ఏ డైరెక్టర్ అయినా మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తే జూనియర్ ఎన్టీఆర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ రీజన్ వల్లే ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందో రాదో చూడాలి.

రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు ఈ కాంబినేషన్ పై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో ఈ స్టార్ డైరెక్టర్లు బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఆసక్తి చూపుతారో లేదో తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుకుంటున్నారు.