అల్లు అర్జున్ అందుకే వెనుకాడుతున్నాడట !

Reason behind Allu Arjun's fear
Reason behind Allu Arjun's fear
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎప్పుడో ఓకే చేసిన ప్రాజెక్ట్  ‘ఐకాన్’.  వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకుడని అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని రోజులకు అల్లు అర్జున్ కు సినిమా మీద ఎక్కడో సందేహం కలిగి పక్కనపెట్టారు.  మళ్లీ వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ చేసి హిట్ కొట్టడంతో ‘ఐకాన్’ను ట్రాక్లోకి తెచ్చారు.  ఇక పట్టాలెక్కించాలని డిసైడ్ అయ్యారు.  అప్పటికీ  అల్లు అర్జున్ కు ప్రాజెక్ట్ మీద సరైన గురి కుదరలేదు.  అందుకే కథలో మార్పులు చేర్పులు స్టార్ట్ చేశారట.  శ్రీరామ్ వేణును కూర్చోబెట్టి వర్క్ చేయిస్తున్నారు.  మరి బన్నీ ఈ సినిమా విషయంలో ఇంతలా తటపటాయియిస్తూ ఉండటానికి బలమైన కారణమే ఉందట. 
 
అదే కథలో ఆయన క్యారెక్టర్. స్టోరీ ప్రకారం హీరో పాత్రకు చూపు ఉండదట.  అంటే అంధుడి పాత్రన్నమాట.  టైటిల్ కింద కనబడుటలేదు అనే ట్యాగ్ లైన్ కూడ హీరో పాత్రను ఉద్దేశించే పెట్టారట.  అల్లు అర్జున్ లాంటి హీరోలకు ఇది పూర్తిగా ప్రయోగమనే అనాలి.  చిన్న, మీడియం రేంజ్ హీరోలు ఇలాంటి పాత్రలు, ప్రయోగాలు చేస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారేమో కానీ స్టార్ హీరోలు చేస్తేనే అనుమానం.  ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు కూడ.  వర్కవుట్ అయితే భీభత్సంగా వర్కవుట్ అవుతుంది.  కాలేదా దారుణంగా దెబ్బతినాల్సి ఉంటుంది.  అందుకే అల్లు అర్జున్ అడుగడుగునా ఆలోచిస్తూ భయం భయంగానే ముందుకు వెళుతున్నారు.