ఓ అర్నబ్ గోస్వామి, ఓ రవి ప్రకాష్.. ఓ మూర్తి, ఓ వెంకట కృష్ణ.. ఇలా ఈ మధ్య జర్నలిస్టుల పేర్లు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల స్థాయిలో జర్నలిస్టులకూ అభిమాన సంఘాలు ఏర్పడుతున్నాయి. ‘మీరు సమాజాన్ని ఉద్ధరించేస్తున్న తీరు అద్భుతం..’ అంటూ సదరు అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సొంత ఛానల్ ఏపీ24 నుంచి బయటకు వచ్చి ఏబీఎన్ ఛానల్‌లో చేరిన సమయంలో వెంకట కృష్ణ అభిమానులు చాలా హంగామా చేశారు. ఇప్పుడాయన ఏబీఎన్ ఛానల్ నుంచి బయటకు వచ్చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నెన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఏబీఎన్ రాధాకృష్ణ మీద జుగుప్సాకరమైన పదాలతో కూడిన ప్రచారాలు సోషల్ మీడియాలో కొత్తేమీ కాదు.
అవి ఇంకోసారి వెంటక కృష్ణ ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చిన దరిమిలా సోషల్ మీడియాలో మార్మోగుతున్నాయి. అదే సమయంలో వెంకట కృష్ణ మీద కూడా బోల్డన్ని బూతు రాతలు కనిపిస్తున్నాయి. అసలేం జరిగింది.? అనే విషయమై మీడియా వర్గాలు కూడా ‘రీసెర్చ్’ మొదలు పెట్టేశాయి. 50 లక్షలు బ్లాక్ మెయిల్ చేసి దొరికిపోయిన వెంకటకృష్ణని ఏబీఎన్ రాధాకృష్ణ బయటకు గెంటేశారన్నది ఓ ప్రచారం. అంతే కాదు, మహిళలపై వెంకటకృష్ణ అసభ్యకరంగా ప్రవర్తించారని కూడా పుకార్లు మొదలయ్యాయి. వీటిల్లో ఏది నిజం.? అన్నది తేలడం అంత తేలిక కాదు. వెంకటకృష్ణ మాత్రం తాను సెలవు మీద వున్నానంటున్నాడు. కట్టు కథలు నమ్మొద్దని తన అభిమానులకు సూచిస్తున్నాడు. మరోపక్క, వెంకటకృష్ణ మళ్ళీ కొత్త కుంపటి యత్నాల్లో వున్నాడనీ, వెంకటకృష్ణ నేతృత్వంలో కొత్త చానల్ జులై – అక్టోబర్ మధ్యలో ఎయిర్ అవుతుందనీ ఇంకో వాదన తెరపైకొచ్చింది. అయినా, ఓ జర్నలిస్టు గురించి ఇంత చర్చ మీడియా, రాజకీయ వర్గాల్లో జరగడమా.? ట్రెండ్ మారింది మరి.