ఏబీఎన్ పై చంద్రబాబు ఫైర్… ఒళ్లు దగ్గరపెట్టుకోండి!

ప్రస్తుతం చంద్రబాబు చాలా ఆచి తూచి నడుచుకుంటున్నారు. అక్కడక్కడా ఫ్రస్ట్రేషన్ లో భాగంగా శృతిమించి మాట్లాడుతున్నా.. తర్వాత పశ్చాత్తప పడుతున్నారు. తమ్ముళ్లు కూడా వయసు రీత్యా ఆ మాత్రం తడబాటు సహజమే అని సర్థిచెప్పుకుంటున్నారు. ఇక అమరావతి విషయంలో కూడా చంద్రబాబు చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు. ఒకప్పుడు అమరావతిపై తెగ మాట్లాడిన బాబు… ఇప్పుడు కాస్త వాయిస్ తగ్గించారు. అమరావతి జిల్లాలో గెలిచినంత మాత్రాన్న 23లో మార్పేమీ రాదని… ఈసారి అధికారంలోకి రానిపక్షంలో కేరాఫ్ జూబ్లిహిల్స్ అయిపోద్దని గ్రహించినట్లే నడుచుకుంటున్నారు! ఈ లోపు ఏబీఎన్ అత్యుత్సాహం చూపించింది!

“ఈరోజు జగన్ ఇచ్చిన సెంటు భూమి పట్టాలు కానీ, ఆర్-5 జోన్ కానీ అనంటూనే… ఇది ఆర్-5 జోన్ కాదు ఆరిపోయే జోన్.. అవును… ఆరిపోయే జోన్ ఆర్-5 జోనే” అని ఎద్దేవా చేశారు ఏబీఎన్ యాంకర్! దీంతో… జగన్ ఇచ్చిన ఇళ్ళ పట్టాలను రేపు కొత్తప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తుందని చెప్పాడంటే యాంకర్‌ కు చంద్రబాబు పై ఎంత గ్రిప్ ఉందనేది తెటతెల్లమవుతుందనే చర్చ మొదలైంది. యాంకర్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఒకరితర్వాత ఒకరు ఇచ్చిపడేస్తున్నారు. యాంకర్ చెప్పిన మాట చంద్రబాబు నాయుడు మనసులోని మాటే అని జనాలు కూడా ఒక క్లారిటీకి వచ్చేస్తున్నారు!

ఇలా తన ప్రమేయం కానీ, లోకేష్ ప్రమేయం కానీ లేకుండా జరిగిన సరికొత్త డ్యామేజ్ పై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఈ కామెంట్లపై సీరియస్ అయిన బాబు ఆ ఛానల్ అధినేతతో మాట్లాడారని సమాచారం. ప్రభుత్వంపై మాట్లాడేటప్పుడు ఫ్రీడం తీసుకోమన్నాము కానీ… టీడీపీ పైనా – తన పైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాడండని సూచించారంట. అనంతరం సదరు యాంకర్ పై స్పందించిన బాబు… ఒళ్లు దగ్గరపెట్టుకోమని ఫైరయినట్లు సమాచారం!

మరి బాబు ఈ స్థాయిలో ఫైరయ్యారు కాబట్టి ఇకపై అయినా సదరు యాంకర్ కాస్త జర్నలిస్టుగా ప్రవర్తిస్తారా.. లేక, తన పాత పంథానే కొనసాగించి… జనం అనుకుంటున్న మాటలు నిజం చేస్తారా అన్నది వేచి చూడాలి!