ఖిలాడి వచ్చేస్తున్నాడు ..క్రాక్ మించి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్న రవితేజ..!

ఖిలాడి సినిమాతో మాస్ మహారాజ రవితేజ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రమేష్ వర్మ రీసెంట్ గా రాక్షసుడు సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. గతంలో రమేష్ వర్మ – రవితేజ కాంబినేషన్ లో వీర వచ్చి డీసెంట్ హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇంతకాలాని ఈ ఇద్దరి కాబినేషన్ లో ఖిలాడి రూపొందుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి క్రాక్ సినిమాతో వచ్చిన రవితేజ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ ని అందుకొని మళ్ళీ సక్సస్ ట్రాక్ మీదకి వచ్చాడు.

ఈ క్రమంలో నెక్స్ట్ సినిమాలని సెట్స్ మీదకి తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ – రవితేజ ల ఖిలాడి సెట్స్ మీదకి వచ్చి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఖిలాడి సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో రవితేజ క్యారెక్టర్ ఏంటో క్లారిటీ ఇచ్చింది. రమేష్ వర్మ ఖిలాడిలో రవితేజ ని హై ఓల్టేజ్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడని హింట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ అయ్యేలా రమేష్ వర్మ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా మీనాక్షి చౌధరి – డింపుల్ హయతి నటిస్తున్నారు. మహారాజా రవితేజ ఖిలాడి కూడా మే 28 న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. క్రాక్ సినిమాను మించి ఖిలాడి భారీ హిట్ అందుకునేలా రవితేక డబుల్ ఎనర్జీతో చేస్తున్నాడట. కాగా రవితేజ నుంచి ఈ ఏడాది చివరిలో మరో సినిమా ని కూడా తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ త్రినాథ నావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కే కామెడీ ఎంటర్‌టైనర్ అని సమాచారం. మొత్తానికి గత మూడేళ్ళుగా రవితేజ నుంచి హిట్స్ రాక రేస్ లో వెనకబడగా మళ్ళీ రేస్ లోకి దూసుకొచ్చాడు.