Dhamakha: రవితేజ ధమాఖా సీక్వెల్…. టైటిల్ కూడా చెప్పేసిన డైరెక్టర్!

Dhamakha: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రాలలో ధమాకా వంటి సూపర్ చిత్రం ఒకటి డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తర్వాత రవితేజ ఎన్నో సినిమాలలో నటించిన అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఇక ప్రస్తుతం ఈయన మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా రవితేజ ధమాకా సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. తాజాగా డైరెక్టర్ త్రినాథ్ రావు మజాకా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సందీప్ కిషన్ రీతు వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ మజాకా సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలిపారు ఆ సినిమాకు డబల్ మజాకా అనే టైటిల్ పెట్టాలనుకున్నాము అయితే ఈ సినిమా ధమాకా సీక్వెల్ తర్వాత చేయాలా ముందే చేయాలా అనే ఆలోచనలో ఉన్నాము అంటూ ఈయన ధమాకా సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక ధమాకా సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతుందని తెలియజేయడమే కాకుండా ఆ సినిమాకు డబుల్ ధమాకా అనే టైటిల్ పెట్టాలని ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలిపారు. ఇప్పటికే రవితేజకు సినిమా కథను కూడా వివరించినట్లు ఈయన వెల్లడించారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది తెలియాల్సి ఉంది.