ఆషామాషీ వ్యవహారం కాదు. యాంకరింగ్ అవకాశాల కోసం లహరి షరి, యాంకర్ రవి వెనకాల తిరగడమా.? అలాగని స్వయంగా రవి, లహరి మీద నిందలు మోపడమా.? దానికి తోడు, ‘సింగిల్ మెన్’ అనే వ్యవహారం తెరపైకి తీసుకురావడమా.? బిగ్ బాస్ హౌస్‌లో అత్యంత జుగుప్సాకరమైన సంఘటన ఇది. దీనికి కారకుడు రవి. ఆ రవి మాటలు విని ప్రియ, లహరిని టార్గెట్ చేసింది. ఇక్కడ రవి తప్పు చేశాడు.. ప్రియ కూడా తప్పు చేశాడు. లహరి, రవిని నమ్మింది.. ప్రియపై మండిపడింది. కానీ, నాగార్జున వీకెండ్ షో సందర్భంగా నిజాన్ని తెలియజేశాడు. లహరి నిజాన్ని తెలుసుకుని, ప్రియ మీద కోపాన్ని తగ్గించుకుంది. రవి నిజస్వరూపాన్ని తలచుకుని, అతని మీద కోపంతో రగిలిపోతోంది. ఇదీ నిన్న జరిగిన ఎపిసోడ్ రచ్చ. నిజానికి, తప్పు చేసింది రవి. మరి, ఆ రవికి శిక్ష పడాలి కదా.? ఇలాంటి సందర్భాల్లోనే, ‘నేరుగా ఎలిమినేషన్’ అనే ప్రక్రియను హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ నిర్వాహకులు వాడి వుండాలి.
అలా చేస్తే, బిగ్ బాస్ రియాల్టీ షో గౌరవం పెరిగేది. కానీ, లహరి ఈ వారం ఎలిమినేట్ అయిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ‘బాధితురాలు’ అని లహరి గురించి స్వయంగా నాగార్జున చెప్పాడు. మరి, బాధితురాల్ని బిగ్ హౌస్ నుంచి పంపేయడం ద్వారా ఏం సంకేతాలు పంపుతున్నట్లు.? బిగ్ హౌస్‌లో సరైనోళ్ళకు చోటు లేదు, కేవలం.. జుగుప్సాకరమైన రీతిలో నాటకాలు ఆడేవారికే అవకాశం అనే సంకేతాలు పంపుతున్నారని అనుకోవాలా.? ఏమో, అదే నిజమేమో. చిన్న విషయం కాదు.. జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో మాత్రమే కాదు.. బిగ్ బాస్ రియాల్టీ షో అంటే, లక్షల మంది వీక్షిస్తోన్న షో.. ఒకమ్మాయి క్యారెక్టర్ మీద దెబ్బకొట్టేశారు.