Rashmika : తెలుగులో ఆల్రెడీ స్టార్ హీరోయిన్ అనిపించేసుకుంది రష్మికా మండన్నా. ఆమె నటించిన ‘పుష్ప’ సినిమా రష్మికా మండన్నాకు స్టార్‌డమ్‌తో పాటు, ప్యాన్ ఇండియా ఇమేజ్ కూడా కట్టబెట్టేసిందనడం అతిశయోక్తి కాదేమో.
ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తోంది రష్మకా మండన్నా. ఆల్రెడీ అక్కడ రష్మిక హవా స్టార్ట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు రష్మిక చేతిలో వున్నాయ్.
అందులో ఒక సినిమా కోసం బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది రష్మికా. ఇకపోతే, తమిళంలో స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. ఇది ప్యాన్ ఇండియా మూవీ కావడం విశేషం.
ఇకపోతే, రష్మికా మంచి నటి మాత్రమే కాదు, పక్కా బిజినెస్ మైండెడ్. ఆ బిజినెస్ కూడా చాలా చాలా పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోంది హీరోయిన్‌గా. అలా అని ఆ రెమ్యునరేషన్ రష్మిక పెంచేసిందేమీ కాదు,
ఆమె పర్ఫామెన్స్, సంపాదించుకున్న స్టార్డమ్‌తో మేకర్లు స్వయానా ఇస్తున్న రెమ్యునరేషనే. ఒకింత స్టార్‌డమ్ రాగానే, అడ్డగోలుగా రెమ్యునరేషన్ పెంచేసి, మంచి అవకాశాలు దూరం చేసుకునే టైప్ నటి కాదు రష్మికా.
ముందే చెప్పుకున్నాం కదా.. చాలా పర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటుంది.
అందుకే 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నా, ఒక్కోసారి ఆ నెంబర్ తగ్గించుకుని మరీ, బిగ్ ఆఫర్లు అందుకుంటోంది. దటీజ్ రష్మిక.. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు రష్మికకి.