Rashmika: సినీ నటి రష్మిక మందన్న ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ఈమె వరసగా యానిమల్, పుష్ప, 2, ఛావా, కుబేర వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక త్వరలోనే మైసా అనే సినిమా ద్వారా రాబోతున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
నటనపరంగా ఎలాంటి పాత్రలలోనైనా పరకాయ ప్రవేశం చేస్తూ అవలీలగా నటించే రష్మిక తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ధూమపానం గురించి ప్రశ్నలు ఎదురవడంతో రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను ధూమపానం వంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించని తెలిపారు. ఇలాంటి వాటి వల్ల ఎంతోమంది బానిసలుగా మారి అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే తాను ధూమపానానికి పూర్తిగా వ్యతిరేకమని వెల్లడించారు. అయితే సినిమాలలో నటించే సమయంలో కథ లేదా తన పాత్ర డిమాండ్ చేస్తే కూడా తాను ధూమపానం చేయనని అవసరమైతే ఆ సినిమా నుంచి తాను తప్పుకుంటాను కానీ ఇలాంటి వాటిలో నటించి యువతను ప్రోత్సహించను అంటూ ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇలా ధూమపానం గురించి ఈమె చేసిన వ్యాఖ్యలపై ఆమె అభిమానులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది కేవలం డబ్బు కోసమే ఇలాంటి సన్నివేశాలలో నటిస్తున్నారు. అలాగే మరి కొంతమంది పెద్ద ఎత్తున ప్రమోషన్లను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. తాను మాత్రం డబ్బు కోసం ఇలాంటి వాటికీ కక్కుర్తి పడను అనే విధంగా రష్మిక చెప్పిన సమాధానం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.