“పుష్ప 2” పై రష్మికా మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ దగ్గర భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం పుష్ప ది రూల్ కూడా ఒకటి. గత చిత్రం పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పాన్ ఇండియా సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా నెలకొన్నాయి.

దీనితో ఈ సినిమా విషయంలో ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మంచి సెన్సేషన్ అవుతుండగా దర్శకుడు సుకుమార్ రెండో సినిమాని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ కూడా కొత్త లుక్ ని ప్రిపేర్ చేస్తుండగా లేటెస్ట్ గా తన శ్రీవల్లి, హీరోయిన్ రష్మికా మందన్నా పుష్ప 2 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.

పుష్ప ది రూల్ కొత్త వరల్డ్ లో చేయడానికి నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని నాతో పాటుగా అల్లు అర్జున్ కూడా అలాగే ఉన్నారు. గత సినిమాలో మా ఇద్దరు పాత్రలని మీరు ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మా పత్రాలు ది బెస్ట్ ఇవ్వబోతున్నాయి అని..

మాతో పాటుగా దర్శకుడు సుకుమార్ కూడా అంతే ఎగ్జైటింగ్ గా ఉన్నారని అయితే రష్మికా తెలిపింది. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.