Rashmika: వామ్మో రష్మిక ఈ మూడు సినిమాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…ఏకంగా ఓ సినిమానే చేయొచ్చుగా?

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నేషనల్ రష్మిక ఒకరు. ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక రష్మిక ఇటీవల వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా వచ్చిన పుష్ప 2 సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం.

ఇక ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలోనే మరో బాలీవుడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా చత్రపతి మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకుంది.

ఇలా ఈ సినిమా కూడా మంచి విజయం కావడంతో రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడుతున్నాయి.. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న రష్మీకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈమె గత మూడు సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. పుష్ప 2 సినిమాకు రష్మిక ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఛావ సినిమాకు గాను 4 కోట్లు, సికిందర్ సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమాలకు కలిపి ఈమె తీసుకున్న ఈ రెమ్యూనరేషన్ తో ఓ మంచి సినిమానే చేయవచ్చు అంటూ ఈ విషయం తెలిసిన నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ షాక్ అవుతున్నారు.