Rashmika and Kajal : ‘ఆ’ విషయంలో రష్మిక – కాజల్ ఇద్దరూ ఇద్దరే.!

Rashmika and Kajal

Rashmika and Kajal వేస్తున్న బ్యూటీ రష్మిక మండన్నా. అలాంటిది వీరిద్దరికీ కామన్ పాయింట్ ఏంటి చెప్మా.. అనుకుంటున్నారా.? వుంది.

ఏదైనా సినిమాని ఒప్పుకుంటే, చాలా కమిట్మెంట్‌తో వ్యవహరిస్తుందట కాజల్ అగర్వాల్. తీసుకున్న రెమ్యునరేషన్‌కి కరెక్టుగా న్యాయం చేయాలన్నదే కాజల్ ఉద్దేశ్యమట. డైరెక్టర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రకంగానూ వమ్ము చేయకూడదన్నదన్న అభిప్రాయంలో తన శక్తి మేర కష్టపడి పని చేస్తుంది కాజల్ అగర్వాల్. అందుకే డైరెక్టర్ ఫ్రెండ్లీ అంటారు అందరూ కాజల్ అగర్వాల్‌ని.

ఇక రష్మిక విషయం చెప్పక్కర్లేదు. చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకున్న ఘనత రష్మిక మండన్నాది. అలాగే స్టార్‌డమ్ కూడా చాలా తక్కువ పీరియడ్‌లోనే రష్మికను వరించిందని చెప్పాలి.

అందుకు కారణం ఆమె ఆటిట్యూడే. అందర్నీ కలుపుకు పోయే తత్వమే. సినిమాకి సంబంధించి ఆమె పడే కష్టం అంతా ఇంతా కాదు, రెమ్యునరేషన్‌తో సంబంధం లేకుండా బాధ్యతతో వ్యవహరిస్తుంటుంది. అలాగే ప్రమోషన్స్‌లోనూ రష్మిక చాలా చాలా యాక్టివ్‌. అంతా తానే అన్నట్లుగా బాధ్యత తీసుకుంటుంది.

ఆయా అంశాలు కాజల్ పైనా, రష్మిక పైనా దర్శక, నిర్మాతలకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ కావడానికి కారణం. అందుకే ఈ ముద్దుగుమ్మల విషయంలో ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువే అంటారు దర్శక, నిర్మాతలు.