రాశి ఖన్నా సంతకాన్ని పచ్చబొట్టు వేయించుకున్న అభిమాని..ఎమోషనల్ అయిన రాశి?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రాశిఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో తెలుగులో వరస అవకాశాలను అందుకుంది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా ఈ అమ్మడు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా రాశి ఖన్నా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జులై 1వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాలో రాశి కన్నా గోపీచంద్ కి జోడిగా నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడు లాయర్ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలైన నాటి నుండి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రాశి ఖన్నా ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రాశికన్నా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ…ఇప్పటి వరకు తను నటించిన సినిమాలలో వరల్డ్ ఫేమస్ సినిమాలోని యామిని పాత్ర అంటే చాలా ఇష్టం . ఆ పాత్రకి నేను బాగా కనెక్ట్ అయ్యాను.కానీ ప్రేక్షకులకి ఆ పాత్ర నచ్చలేదు అని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో రాశి ఖన్నా మరొక ఆసక్తికర విషయం కూడా బయట పెట్టింది. సాధారణంగా నటీనటులు ప్రేక్షకుల నుండి ఎంతో అభిమానాన్ని సొంతం చేసుకుంటారు. నటిగా మారటం వల్ల రాశీ కన్నా కూడా ప్రేక్షకుల నుండి చాలా అభిమానం సొంతం చేసుకుందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఒక సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు. ప్రతిరోజు పండగే సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి వీరాభిమాని అని చెప్పి ఆమె ఆటోగ్రాఫ్ ని చేతిపై రాయించుకున్నాడట. తర్వాత రోజు ఆమె సంతకాన్ని పచ్చబొట్టుగా వేయించుకొని వచ్చాడట. ఈ విషయం చెబుతు రాశి ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య సరసన రాశీ నటించిన థాంక్యూ సినిమా కూడ విడుదలకి సిద్దంగా ఉంది.