Ranabir Kapoor- Aliya: బాలీవుడ్ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి కొన్ని జంటలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ డిసెంబర్ 9 వ తేదీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ కూడా ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ జంట కూడా ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఇకపోతే వీరిద్దరూ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మోషన్ పోస్టర్ విడుదలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఈ వేడుకలో భాగంగా అలియా భట్, రణబీర్ కపూర్ లకు మీడియా నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాగే కొన్ని ప్రశ్నలు పేపర్లో రాసి వారికి ఇవ్వగా వాటిని చదువుతూ సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా రణబీర్ కపూర్ అలియా పెళ్లి గురించి ప్రశ్నలు తలెత్తాయి. మీ పెళ్లి ఎప్పుడు అంటూ వారిని ప్రశ్నించడంతో ఆ ప్రశ్నకు రణబీర్ కపూర్ ఎంతో ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. అందరూ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. నాకు కూడా అందరి మాదిరి పెళ్లి చేసుకుని జీవితంలో సంతోషంగా గడపాలని ఉంది మరి మన పెళ్లి ఎప్పుడు? అంటూ అలియాభట్ వైపు చూస్తూ అడిగారు.
రణబీర్ అలా తన వైపు చూసి అడగడంతో ఆమె నన్ను అడుగుతావేంటి? అంటూ సమాధానం చెప్పింది. ఇలా వీరిద్దరూ వారి పెళ్లి గురించి ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఇది చూసిన నెటిజన్లు మాత్రం వీరి వ్యవహారశైలి చూస్తుంటే ఇప్పుడే పెళ్లి చేసుకునేలా లేరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలుస్తోంది.