తిరుమల శ్రీవారి వెనుక రాజకీయాలు జరుగుతున్నాయా? అర్చకులకు-ప్రభుత్వానికి మధ్య సఖ్యత చెండిదా? అంటే అనడానికి చాలా సంఘటనల్నే ఉదాహరణగా చెప్పొచ్చు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడా అన్యమత ప్రచారం జరుగుతోందనే ఆరోపణ తెరపైకి వచ్చింది. వాటి తాలుకా వీడియోలు కూడా కొన్ని బయటకు రావడం హిందువుల్లో కలకలం రేగింది. దానికి తోడు జగన్ మోహన్ రెడ్డి బాబాయి వై.వి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఎంపిక చేయడం వెనుక మతలబు ఉందనే కొంత మంది వాదించారు. వీటికి తగ్గట్లు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కొండపై తాజా కరోనా పరిస్థితులను వివరించడం…వీటికి వ్యతిరేకంగా వైవి సుబ్బారెడ్డి కౌంటర్లు చూస్తుంటే? ఇందులో కూడా రాజకీయం చోటు చేసుకుందనే అనుమానం రాకమానదు. టీటీడీ అర్చకులుగా రమణ దీక్షితులది సుధీర్ఘ ప్రస్థానం.
అంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ తప్పిదాల్ని ధైర్యంగా ఎత్తి చూపారు. వాటికి పరిష్కారం చూపించాలని డిమాండ్ చేసారు. అలాగే ఇటీవల కరోనా సోకి మృతి చెందిన అర్చకుల కుటుంబాల్ని ఆర్ధికంగా ప్రభుత్వం ఆదుకోవాలని మరోసారి డిమాండ్ చేసారు. ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి వాళ్లకి ఎలాంటి పరిహారం అందంలేదని అసంతృప్తిని వ్యక్తం చేసారు. అలాగే కరోనా కోరలుచాచి విరుచుకుపుడుతున్నా దర్శనాలు యథేశ్చగా జరుగుతున్నా యి….ప్రభుత్వం వీటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేసారు. తిరుపతి కొండని కరోనా చుట్టేసిన మాట వాస్తవం. తెలిసో తెలియకో భక్తులు స్వామివారి మొక్కులు తీర్చుకోవడానికి కొండకెళ్లి..కరోనాతో తిరిగొస్తున్నారు.
దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవన్నీ పక్కనెబెడితే! తాజా అరోపణలు నేపథ్యంలో రమణ దీక్షితులు బీజేపీ లోకి చేరుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో బీజేపీ-మిత్రపక్షం జనసేనతో కలిసి పుంజుకుంటోన్న సంగతి తెలిసిందే. ఏపీలో రెండవ ప్రధాన పార్టీగా బీజేపీ అవుతుందని ఆపార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారం ఉన్న పార్టీ క్రైస్తవ మతానికి పెద్ద పీట వేస్తుందని ఆరోపణలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక బీజేపీ హిందువాది. కాబట్టే రమణ దీక్షితులు ఈ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారా? అన్న అనుమానం బలపడుతోంది.