Ram Pothineni: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో రామ్ పోతినేని సినిమాలు చేయడం చాలా వరకు తగ్గించేశారు. కేవలం ఏడాదికి ఒక్క సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరిస్తున్నారు. అందులో భాగంగానే గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు స్కందా సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ఈ మధ్యకాలంలో రామ్ పోతినేని నటించిన సినిమాలు ఏవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో హీరో రామ్ పోతినేనికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. అదేమిటంటే..
రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలోకి విడుదల కానుంది. ఇకపోతే ఇటీవల ఈ మూవీ నుంచి నువ్వుంటే చాలే అని సాగే పాటని రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. హీరో రామ్ పోతినేని ఈ పాటని రాయగా రాక్ స్టార్ అనిరుధ్ పాడారు. అయితే ఇప్పుడు ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాకుండా సీజనల్ సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా మారిపోయింది.
మహేష్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. అయితే ఇంతకముందు ఎన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో ఒక పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. ప్రేమకు నిజమైన అర్థాన్ని తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయాణంలా ఈ సాంగ్ అనిపిస్తుంది. రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోని ఇది మ్యూజిక్ లవర్స్ కి బాగా నచ్చేసింది. ఇదే పాటలో రామ్, భాగ్య శ్రీ జంట చూడముచ్చటగా ఉంది. కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్ కానుందని అనిపిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా రామ్ సక్సెస్ ని అందుకుంటారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ సినిమాలోని పాట యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతోంది.

