RGV: ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ..

RGV: టాలీవుడ్ , ఏపీ సర్కార్ కు మధ్య టిక్కెట్ల ధరల విషయంలో గోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.. తాజాగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘అదిర్ వర్మ ‘ డైరెక్షన్ లో ‘ రామ్ గోపాల్ వర్మ ‘ కీలకపాత్రలో తెరకెక్కిన ఆర్జివి మిస్సింగ్ అనే ట్రైలర్ గురించి చర్చ జరుగుతోంది. ఇందులో ఏపీ , తెలంగాణ ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు.

తాజాగా టికెట్ ధరలు తగ్గించడంతో నాచురల్ స్టార్ నాని జగన్ సర్కారుపై విమర్శలు చేశారు. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం , టాలీవుడ్ చిన్న పిల్లలాగా వ్యవహరిస్తున్నారని టాలీవుడ్ ఇండస్ట్రీ గట్టిగా ప్రయత్నం చేయకపోవడం వల్లే ఇలా వివాదాలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఏదైనా గట్టిగా ప్రయత్నం చేసినప్పుడే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ” ఆర్జివీ” పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ” నా సినిమాను ఏపీ , తెలంగాణ రెండు రాష్ట్రాల థియేటర్లలో విడుదల చేస్తానని.. నా సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఎటువంటి అడ్డు చెప్పలేదని .. అంతేకాదు ప్రభుత్వం తలచుకుంటే ఎవరి బెడ్ రూమ్ లోకి అయినా వెళ్లే అధికారం ఉంటుంది అని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.