నార్త్ లో ఈ బిగ్ స్టార్ సినిమాలో కామియో కి రెడీ అయిన చరణ్..డీటెయిల్స్ ఇవే.!

ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అటు నార్త్ సినిమాలో కానీ అలాగే ప్రపంచ వ్యాప్తంగా గాని మాములుగా లేదని చెప్పాలి. తన లేటెస్ట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) హిట్ మరియు తన రోల్ తో వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు దీనితో ఈ భారీ సినిమా అనంతరం బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాను ఇప్పుడు ఓ బాలీవుడ్ బిగ్ స్టార్ సినిమాలో క్యామియో చేసేందుకు రెడీ అయ్యినట్టుగా బాలీవుడ్ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. 

వారు చెబుతున్న దాని ప్రకారం అయితే చరణ్ ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న “కబీ ఈద్ కబీ దీవాళీ” సినిమాలో నటించడానికి సిద్ధం అయ్యాడట. అయితే ఇది ఆక్టింగ్ సీన్ అయితే కాదట సల్మాన్ తో కలిసి ఓ సాంగ్ లో తాను మెరవనున్నాడని తెలుస్తుంది. ఇది వరకే సల్మాన్ ఓ సినిమా కోసం చరణ్ తన వాయిస్ ఓవర్ ని అందించాడు. 

ఇప్పుడు ఈ సినిమా కోసం క్యామియో కి ఒప్పుకున్నాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ వార్తలు ఏమిటంటే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తుండగా పూజా హెగ్డే కూడా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ మరియు యో యో హనీ సింగ్ లు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక చరణ్ అయితే ప్రస్తుతం మరో టాప్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.