కరోనా నుండి కోలుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. త్వ‌ర‌లోనే షూటింగ్‌కు వెళతానంటున్న చెర్రీ

KGF director prasanth neel planning to direct ram charan

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క్రిస్మ‌స్ పండుగ‌కు ముందు ఏర్పాటు చేసిన వేడుక‌క మెగా ఫ్యామిలీ అంద‌రిని ఇన్వైట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీకు సాయిధ‌ర‌మ్ తేజ్ నుండి మొద‌లు పెడితే వైష్ణ‌వ్ తేజ్, వ‌రుణ్ తేజ్, అల్లు అర్జున్ , శిరీష్‌, క‌ళ్యాణ్ దేవ్‌, చైత‌న్య‌,నిహారిక అంద‌రు హాజ‌ర‌య్యారు. పార్టీలో ఫుల్ చిల్ అయిన మెగా ఫ్యామిలీ ప‌లు ఫోటోల‌కు కూడా ఫోజులిచ్చారు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

మెగా ఫ్యామిలీ అంత‌టిని ఒకే ఫ్రేంలో చూసి మురిసిపోయిన అభిమానుల‌కు రామ్ చ‌ర‌ణ్ షాక్ ఇచ్చాడు. పార్టీ జరిగిన నాలుగు రోజుల‌కు అంటే డిసెంబ‌ర్ 29న త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయింద‌ని చెప్పుకొచ్చాడు. చెర్రీ ప్ర‌క‌టించిన కొద్ది గంట‌ల‌లో వ‌రుణ్ తేజ్ కూడా త‌న‌కు క‌రోనా సోకింద‌ని అన్నాడు. దీంతో మెగా ఫ్యామిలీ స‌భ్యుల గుండెల‌లో గుబులు మొద‌లైంది. అంద‌రు టెస్ట్‌లు చేయించుకోగా, ఎవ‌రికి క‌రోనా సోక‌లేదు. అయితే కొద్ది రోజులుగా రామ్ చ‌రణ్ తేజ్, వ‌రుణ్ తేజ్‌లు క్వారంటైన్‌లో ఉండ‌గా రీసెంట్‌గా వ‌రున్ త‌న‌కు పాజిటివ్ వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు.

ఇక కొద్ది సేప‌టి క్రితం రామ్ చ‌ర‌ణ్ కూడా త‌న‌కు నెగెటివ్ వ‌చ్చింద‌ని పోస్ట్‌లో తెలిపాడు. షూటింగ్‌లో పాల్గొనేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. మీ అంద‌రి దీవెన‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను అంటూ చెర్రీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో నాగ‌బాబుకు క‌రోనా సోక‌గా, ఆయ‌న కూడా కొద్ది రోజుల త‌ర్వాత కోలుకున్నారు. ఇక చర‌ణ్‌ తండ్రి
మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షల్లో లోపాల వల్ల చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. రెండు రోజుల్లోనే ఆయన క్వారంటైన్‌ నుంచి బయటికి వచ్చారు. ప్రస్తుతం రామ్‌చరణ్.. రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉంది.