పంజాబీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ హవా ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో కొనసాగుతుంది. మంచి హిట్స్ రాకపోయిన సరే ఈ అమ్మడి కాల్షీట్స్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంటుంది. రకుల్. ఆ మధ్య కరోనా బారిన పడిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. స్వీయ నిర్బందంలో ఉన్నాను, ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోండని కోరింది. అయితే కరోనా వలన తన శరీరంలో వచ్చిన మార్పులని తొలగించేందుకు ప్రతి రోజు కసరత్తులు చేసింది.
సాధారణంగానే రకుల్ ఫిట్‌నెస్ కాపాడుకునేందుకు రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. జిమ్ డ్రెస్‌లో రకుల్‌ని చూసిన అభిమానులకు గుండెలు గల్లంతవుతుంటాయి. ఇటీవల రెగ్యులర్ వర్కవుట్స్ చేస్తున్న రకుల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పిక్స్ షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. తాజాగా రకుల్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇందులో రకుల్ తన కాలుని పైకి లేపి చేతితో పట్టుకొని ఉంది. ఈ ఫొటో చూస్తేనే అర్ధమవుతుంది రకుల్ తన ఫిట్‌నెస్‌ని ఏ లెవల్‌లో పెంచుకుందో.
ఇటీవల రకుల్ .. వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన చిత్ర షూటింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ చిత్రంలో నటించింది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాది పాత్రలో కనిపించి అలరిస్తుంది. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘డాక్టర్ జీ’ చిత్రంలో నటించబోతున్నది. క్యాంపస్ కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు అనురాగ్‌కశ్యప్ సోదరి అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించనున్నారు. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన మేడే అనే సినిమాలోను రకుల్ నటిస్తుంది.