ఎవరూ పట్టించుకోవట్లేదు.. అందుకే రకుల్ ఎక్కువ చేస్తోంది

Rakul Preet Singh struggles to get offers

Rakul Preet Singh struggles to get offers

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల జాబితా తీస్తే అందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు ఖచ్చితంగా ఉండేది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, సూర్య, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో నటించిన ట్రాక్ రికార్డ్ ఉందామెకు. ఒకప్పుడు అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోయిన్ ఆమె. కానీ ఇప్పుడు అవకాశాలే కరువయ్యాయి. వరుస ఫ్లాపులు ఆమెను డీలా పడేలా చేశాయి. ‘స్పైడర్, మన్మథుడు 2’ సినిమాలు బోల్తా కొట్టడంతో ఆమె ఛరీష్మా మసకబారింది. గ్లామర్ ఉన్నా అవకాశాలు తగ్గాయి.

ఇదే సమయంలో ఇంకొక పొరపాటు చేసిందామె. అదే హిందీ పరిశ్రమ వైపు వెళ్లడం. తెలుగులో కెరీర్ కాస్త డౌన్ కావడంతో బాలీవుడ్ మీద హోప్స్ పెట్టుకుంది. అక్కడ అరకొర అవకాశాలు రావడంతో తెలుగుకు మొహం చాటేసింది. దాంతో తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు తెలుగు నిర్మాతలు, దర్శకులు కూడ ఆమెను మర్చిపోయారు. రష్మిక లాంటి వాళ్ళు ఆమెను రీప్లేస్ చేస్తున్నారు. ప్రజెంట్ తెలుగులో ఆమె చేసింది వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా ఒక్కటే. అదే ఆమెకు ఆధారం. అది హిట్టైతేనే అవకాశాలొస్తాయి. ఈ విపత్కర పరిస్థితిని ఆలస్యంగా గమనించుకున్న రకుల్ డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది.

సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో చెలరేగిపోతోంది. గతం కంటే గ్లామర్ డోస్ పెంచింది. అడ్డూ ఆపూ అని లేకుండా అందాలన్నీ బయటపెట్టేస్తోంది. ఆ ఫోటోలతో సోషల్ మీడియా మొత్తం ఆమే హాట్ టాపిక్ అయింది. మరి ఈ ఆరబోతతో అయినా ఆమెకు అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి.