‘రాక్షసుడు 2’ లో టాలీవుడ్ స్టార్ హీరో… 100 కోట్లు బడ్జెట్

'rakshasudu 2' movie to be produced with a budget of 100 crores

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్లో 2019లో వచ్చిన ‘రాక్షసుడు’ మూవీ మంచి సక్సెస్ సాధించింది. వరుస ప్లాపులతో ఇబ్బందిపడుతున్న బెల్లంకొండకు ఈ మూవీ విజయం ఊరటనిచ్చింది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మించారు. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇదివరకనే మేకర్స్ ప్రకటించటం జరిగింది. మొదటి భాగంలో నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ ప్లేస్ లో మరో హీరో నటించనున్నారని సంగతి తెలిసిందే. ఈ రోజు రాక్షసుడు సినిమా విడుదలై రెండు సంవత్సరాలైన సందర్బంగా సీక్వెల్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

 

నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ… ” రాక్షసుడు మూవీ విడుదలై అప్పుడే రెండేళ్లు గడిచిపోయాయంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ మూవీ సక్సెస్ ను ఇంకా అనుభవిస్తున్నాం. దీనికన్నా మించిన ఎక్సయిటింగ్ పాయింట్ తో ‘రాక్షసుడు 2’ మూవీని చేయబోతున్నాం. దాదాపుగా 100 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ తరహాలో ప్లాన్ చేస్తున్నాం. చిత్రీకరణ మొత్తం లండన్ లో ఉంటుంది. ఒక స్టార్ హీరోతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం. అన్ని వర్గాల అభిమానుల కోసం మరిన్ని కమర్షియల్ అంశాలను ఇందులో ఉండేలా చూస్తున్నాం. త్వరలోనే నటీ నటుల, సాంకేతిక నిపుణుల వివరాలను” వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.