వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజుపై అదిష్టానం వేటుకు సిద్దమవ్వడంతో రఘురామ కూడా ఢీ అంటే ఢీ అంటూనే ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వంతో వైకాపా వివాదం దాదాపు చివరి అంకానికి చేరుకుంది. అనధికారికంగా రఘురామ పార్టీకీ గుడ్ బై చెప్పినట్లుగానే ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది. అవకాశం ఉన్నంత కాలం జగన్ ని లేఖల ద్వారా కాకా పట్టే ప్రయత్నం చేసారు. అప్పటికే రఘురాంపై కన్నేసి పరిశీలించిన సీఎం జగన్ ఇతనితో వ్యవహారం తేడాగా ఉందని భావించినట్లే కనిపించింది. ఈ పరిస్థితిని .. ఎంపీని కూడా తొందరగానే అర్ధం చేసుకున్నారు. జగన్ లైట్ తీసుకోవడంతో రఘురామ కూడా దాదాపు బరి తెగింపుకి తెగబడ్డారు.
జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలనని టార్గెట్ చేసి నిప్పులు కురిపించడం మొదలు పెట్టారు. టీటీడీ లో అన్యమత ప్రచారం పేరుతోనూ…అయోధ్యలో రామాలయ నిర్మాణం నేపథ్యంలో మతాల మధ్య చిచ్చు రేప ప్రయత్నం చేసారు. కానీ వాటిని జగన్ సర్కార్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఇప్పుడు ఏపీలో ట్రెండింగ్ టాపిక్ మూడు రాజధానులు. కాబట్టి కొద్ది రోజులుగా రఘురాం అదే పనిమీద ఉన్నారు. పరిపాలనా రాజధాని తరలింపు విషయంలో చంద్రబాబు నాయుడు..ఆయన పార్టీ అయిన టీడీపీకి పూర్తిగా మద్దతు దారుడిగా మారిపోయారు. ఈ విషయంలో చంద్రబాబు తానా..అంటే రఘురామ తందాన అనడం మొదలు పెట్టారు. మూడు రాజధానుల విషయంలో రఘురామ తన సన్నిహిత న్యాయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారుట. దీనికి పార్లమెంట్ ఆమోదం తప్పని సరి అని గట్టిగానే స్వరం వినిపిస్తున్నారు. ఇలా రఘురామకి ఏడాదిగా గుర్తురాని అంశాలన్ని ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న వారినే విమర్శించే స్థాయికి రఘురామ దిగజారిపోయారు.
అంటే రఘురామ వైఖరేంటో స్పష్టంగా భయటపడుతోంది. వీటన్నింటిని జగన్ అండ్ కో క్లోజ్ గానే వాచ్ చేస్తున్నారు. అమరావతి విషయంలో అర్ధం లేని వ్యాఖ్యలు చేసే సరికి జగన్ కూడా రఘురామపై చిర్రెత్తిపోతున్నారన్నది ఇన్ సైడ్ టాక్. గేదె గట్టు మేస్తే దూడ పొలంలా మేస్తుందా? అనే ఓ అంచనాకి జగన్ వచ్చేసారుట. ఇన్నాళ్లు ఎంపీపై జగన్ మనసులో ఎక్కడో చిన్న సాప్ట్ కార్న్ ఉన్నా మూడు రాజధానుల డ్రీమ్ విషయంలో వేళ్లు..కాళ్లు పెట్టేసరికి మంటెక్కిపోతున్నారని పార్టీ వర్గాల్లో సీరియస్ డిస్కషన్ కి వచ్చింది. మరి మునుముందు జగన్ మోహన్ రెడ్డి ఎంపీపై ఎలాంటి చర్యలకు దిగుతారన్నది చూడాలి.