రాజ్యసభకు ఎంపికైన రాజమౌళి తండ్రి.. ఆయనతోపాటు ప్రముఖ సంగీత దర్శకుడు..?

తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. సౌత్ ఇండియా నుండి రాజ్యసభకు నలుగురు ప్రముఖులను ఎంపిక చేస్తూ ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. సౌత్ నుండి రాజ్యసభకు ఎంపికైన వారిలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒకరు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రచయితగా మంచి గుర్తింపు పొందాడు. 1988 నుండి ఆయన ఎన్నో సినిమాలకి కథలను అందించాడు. అంతే కాకుండా నాలుగు సినిమాలకి దర్శకత్వం కూడా వహించాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది. అటువంటి గొప్ప సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.

ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ కూడా విజయేంద్రప్రసాద్ అందించినదే. ఇటువంటి ఎన్నో గొప్ప సినిమాలకి కథా రచయితగా పనిచేసిన విజయేంద్ర ప్రసాద్ ని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తూ నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మరొక ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1970 నుండి సంగీత దర్శకుడిగా ఇళయరాజా ఎన్నో సినిమాలకు తన సంగీతాన్ని అందించాడు. ఇప్పటికీ ఇళయరాజా తన సంగీత బానీలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇలా సౌత్ సినీ ఇండస్ట్రీ నుండి ఇద్దరు గొప్ప వ్యక్తులు రాజ్యసభకు ఎన్నిక కావడంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఇలా సినిమా ఇండస్ట్రీ నుండే కాకుండా మరో రెండు రంగాల నుండి కూడా సౌత్ ఇండియా వాళ్లను నరేంద్ర మోడీ రాజ్యసభకు ఎంపిక చేశాడు. క్రీడారంగం నుండి పరుగుల రాణి పి.టి.ఉషని రాజ్యసభకు ఎంపిక చేయగా..అలాగే కర్ణాటక ధర్మశాల దేవస్థానానికి చెందిన ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకి కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్రపతి కోటాలో సౌత్ ఇండియా నుండి నలుగురు ప్రముఖులను ప్రధానమంత్రి రాజ్యసభకు ఎంపిక చేస్తూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.