Rajamouli: మహేష్ పోటీపడటం కోసం టాలీవుడ్ హీరోని రంగంలోకి దింపిన రాజమౌళి?

Rajamouli: ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా విడుదల కావలసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది. ఈ పాన్ ఇండియన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాలేకపోయింది. సోషల్ మీడియాలో మహేష్ బాబు, రాజమౌళి సినిమా గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా మహేష్ బాబు,రాజమౌళి ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఈ మధ్య రాజమౌళి తండ్రి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అందరూ అనుకుంటున్నట్లు ఈ సినిమాలో హీరో ఒక్కరే కాదు. ఈ సినిమా కూడా ఆర్ఆర్ఆర్ లాగా మల్టీ స్టారర్ సినిమా అని చెప్పుకొచ్చారు. అయితే ఇంకో హీరో తెలుగు ఇండస్ట్రీలో కాకుండా తమిళ హీరో అని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో సీనియర్ నిర్మాత కె ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మించబోతున్నారు. ఐతే రాజమౌళి ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపీచంద్ నీ
కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.మరి గోపీచంద్ రాజమౌళి ఆఫర్ నీ అంగీకరిస్తాడా, లేక తిరస్కరిస్తాడో చూడాలి.