‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ సాంగ్… జక్కన్న ప్లానింగ్ అదుర్స్ !

Rajamouli planning special elements for promotional song

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇంకా రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూనే మరోవైపు పాటలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు జక్కన్న. ఈ రెండు పాటలు మూవీలో చాలా ప్రత్యేకమని సమాచారం. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో సాంగ్స్ షూటింగ్ జరుగుతుంది. ఇందులో ఒక సాంగ్ ని కేవలం మూవీ ప్రమోషన్ కోసం ప్లాన్ చేశారట. అయితే ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న కీరవాణితో కాకుండా టాలెంటెడ్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ తో ప్రమోషనల్ సాంగ్ ని కంపోజ్ చేయిస్తున్నారని తెలుస్తోంది.

Rajamouli planning special elements for promotional song

అంతేనా… ఈ సాంగ్ కి మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్. ఇందులో రాజమౌళి గత చిత్రాల హీరోలైన ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, నితిన్ లు కూడా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఈ హీరోలు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి కన్నుల పండగే. బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న ఈ మూవీ మీద దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జక్కన్న ప్రమోషన్స్ మొదలెట్టి మరింత హైప్ పెంచుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేసేందుకు రాజమౌళి టీం సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది.