ఎట్టకేలకు పుష్ప సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి.. పుష్ప హిట్ కావడానికి కారణం ఇదేనా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందింది. కలెక్షన్ల పరంగా నార్త్ ఇండియాలో భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టడమే కాకుండా అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈ సినిమా మంచి విజయం అందుకోవడం తో అభిమానులు పుష్ప పార్ట్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ల లేదు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి గల కారణం ఏంటి అనే సీక్రెట్ బయట పెట్టారు. ఈ సినిమా మంచి విజయం సాధించడానికి హీరో క్యారెక్టరైజేషన్ ప్రధాన పాత్ర వహించిందని తెలిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఎంతో సాఫ్ట్ మూవీస్, ఫీల్ గుడ్ మూవీస్ వస్తున్నాయి. ఒక్కసారిగా పుష్ప లాంటి మాస్, రస్టిక్ క్యారెక్టర్ తగలడంతో నార్త్ ఇండియన్స్ ఈ సినిమాని ఎంతగానో ఆదరించారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ అందరిని సందడి చేయడమే ఈ సినిమా విజయానికి కారణమని, పుష్ప పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావడం వెనుక ఉన్న సీక్రెట్ ఇదేనని రాజమౌళి వెల్లడించారు. ఇందులో సునీల్ అనసూయ పాత్రలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని. అలాగే విలన్ పాత్ర కోసం మలయాళ నటుడు ఫాహద్ పజిల్ ఎంట్రీ ఇవ్వడం ఇలా అన్ని పాత్రలు ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించాయని జక్కన్న వెల్లడించారు.