Raja Sree: తాను సినిమాల్లోకి వస్తానంటే మొదటగా తన ఇంట్లో ఒప్పుకోలేదని ప్రముఖ నటి రాజశ్రీ నాయర్ అన్నారు. తన ఫ్యామిలీలో చాలా మంది డాక్టర్లే అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రారంభంలో ఇంట్లో వాళ్లు తాను సినిమాల్లోకి వస్తాను అంటే ఎందుకు, అవసరమా అని అన్నారని ఆమె అన్నారు. నిజం చెప్పాలంటే వాళ్లు ఈ ఫీల్డ్ అంటే భయపడి అలా చెప్పారని ఆమె చెప్పారు.
ఇకపోతే తాను హైదరాబాద్‌కు వచ్చాక యాంకర్‌గానూ పని చేశానని ఆమె చెప్పాను. మొదట్లో బ్లూ సినిమా తర్వాత తనకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చాయని ఆమె అన్నారు. తెలుగులోనూ కొన్ని ఛాన్స్‌లు వచ్చాయని ఆమె స్పష్టం చేశారు.
ప్రముఖ నటుడు మోహన్ లాల్‌తో వర్క్ చేసినపుడు ఆయన అప్పటికే చాలా పెద్ద హీరో అని రాజశ్రీ నాయర్ తెలిపారు. ఆయన చాలా సహజంగా నటిస్తారని, దాంతో పాటు చాలా బ్రిలియంట్ నటుడు అని ఆమె పొగిడారు. మొదటిసారిగా ఆయనతో కలిసి పని చేస్తున్నపుడు చాలా భయంగా ఉండేదని ఆమె అన్నారు. కనీసం ఆయన చూసినా కూడా చాలా భయపడేదాన్నని, ఆ సమయంలో తానేమైనా తప్పు చేశానా అని అనిపించేదని ఆమె చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయనతో మాట్లాడాక చాలా క్లోజ్‌గా అనిపించారని ఆమె అన్నారు.
సౌందర్య తనకంటే చాలా సీనియర్ ఆర్టిస్ట్ అని రాజశ్రీ అన్నారు. తనెప్పుడూ తన సోదరునితో వచ్చేదని, ఎప్పుడు చూసినా చాలా దూరంగా కూర్చొని కనిపించేవారని ఆమె చెప్పారు. అంతే కాకుండా చాలా చక్కగా పలకరించేవారని ఆమె చెప్పుకొచ్చారు. ఎప్పుడు కలిసినా నవ్వుతూ హాయ్, హలో అంటూ బాగా మాట్లాడేవారని ఒక ఇంటర్వ్యూలో రాజశ్రీ సౌందర్య గురించి, తన వ్యక్తిత్వం గురించి ఇలా చెప్పుకొచ్చారు.
