నగ్న ఫొటో షేర్ చేసుకున్న మరో నటుడు.. వైరల్ పిక్!

ఈమధ్య నగ్నంగా దిగుతూ ఫోటోలు పంపించడం బాగా ట్రెండ్ అవుతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా తాను నటిస్తున్న లైగర్ సినిమాలో నగ్న ఫోటో షేర్ చేసుకున్న సంగతి తెలిసింది. ఇక తాజాగా ఆయన మాదిరిగా మరో నటుడు నగ్న ఫోటో షేర్ చేసుకున్నాడు. ఇంతకు ఆయన ఎవరంటే బాలీవుడ్ ప్రముఖ నటుడు వినోద్ కన్నా పెద్ద కొడుకు రాహుల్ కన్నా.

రాహుల్ కన్నా నటుడుగా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఇక రచయితగా కూడా ఈయన బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియాలో ఒంటిపై బట్టలు లేకుండా దిండు అడ్డుపెట్టుకొని సోఫాలో కూర్చున్న ఫోటోను షేర్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఆ ఫోటోకు తాను ఇప్పటివరకు చాలా రహస్యంగా ఉంచాను అంటూ.. ఇక దాన్ని బయటపెట్టి సమయం వచ్చింది అని.. రివిల్ చేసే అతిపెద్ద విషయం కోసం వేచి ఉండండి అని రాసుకొచ్చాడు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.