మళ్లీ హత్రాస్ కు రాహుల్.. నన్ను ఏ శక్తీ ఆపలేదన్న రాహుల్

rahul gandhi again tries to visit hatras

ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో ఎంతటి ఘోరం జరిగిందో ప్రపంచమంతా చూసింది. దళిత యువతిపై అతికిరాతకంగా ప్రవర్తించారు నిందితులు. దళిత యువతిపై అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టడంతో ఆ యువతి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ ఘటన అంతటా సంచలనం రేపింది. అంతే కాదు.. ఆ యువతి మృతదేహాన్ని రాత్రిపూట హడావుడిగా పోలీసులు కుటుంబ సభ్యులు లేకుండానే అంత్యక్రియలు నిర్వహించడం యూపీలో చర్చకు దారితీసింది. ప్రభుత్వం అసమర్థతపై ప్రజలంతా విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

rahul gandhi again tries to visit hatras
rahul gandhi again tries to visit hatras

ఈనేపథ్యంలో హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి.. రెండు రోజుల కిందటనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. బాధితురాలి కుటుంబ సభ్యులను కలవనీయకుండా రాహుల్ ను అడ్డుకోవడంతో.. రాహుల్ అక్కడే కింద పడిపోయాడు.

తాజాగా రాహుల్ గాంధీ.. మరోసారి హత్రాస్ కు వెళ్తున్నట్టు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా తాను మరోసారి హత్రాస్ వెళ్తున్నట్టు తెలిపారు. హత్రాస్ వెళ్లకుండా నన్ను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు. తమ బిడ్డను పోగొట్టుకున్న ఆ కుటుంబం ఎంతో బాధపడుతోంది. వాళ్లను ఓదార్చడానికి.. వాళ్ల బాధను పంచుకోవడానికి నేను ఖచ్చితంగా హత్రాస్ కు వెళ్తా.. అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.

అయితే.. రాహుల్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే.. రాహుల్ పర్యటనకు అనుమతి లేదని… హత్రాస్ జాయింట్ కలెక్టర్ ప్రేమ్ ప్రకాశ్ మీనా ప్రకటించారు. హత్రాస్ లో 144 సెక్షన్ కొనసాగుతోందని.. ఇప్పుడు పర్యటనలకు అనుమతి లేదన్నారు. ఏ రాజకీయ పార్టీ నేతలను ప్రస్తుతం హత్రాస్ కు అనుమతించడం లేదంటూ స్పష్టం చేశారు.

దీంతో.. మరోసారి రాహుల్ పర్యటనపై సందిగ్దత నెలకొన్నది. మరి.. ఈసారైనా రాహుల్ హత్రాస్ వెళ్లి బాధిత కుటుంబాన్ని కలిసి వస్తారా? లేదా? అని అందరూ వేచి చూస్తున్నారు.