విజయసాయి రెడ్డిని కట్టడి చేయకపోతే పార్టీకి ప్రమాదం: రఘురామ కృష్ణం రాజు

Raghyurama krishnam raju wrote a letter to cm jagan over vijayasai reddy

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు నుండి సీఎం జగన్ కు లేఖల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు రాసిన లేఖలో ఎంపీ విజయసాయి రెడ్డి గురించి హెచ్చరిస్తూ కొన్ని సూచనలు చేయటం గమనార్హం. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ చైర్మన్ విషయంలో అశోక్ గజపతి రాజు కేసు గెలిచారని పేర్కొంటూ… అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి నోరు పారేసుకొంటున్నారని ఆయనను వెంటనే అదుపు చేయాలన్నారు.

Raghyurama krishnam raju wrote a letter to cm jagan over vijayasai reddy

మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం ఆలయ ఛైర్మన్ గా అశోక గజపతి రాజును రాష్ట్ర హైకోర్టు తిరిగి నియమించిన సంగతి తెలిసిందే. ట్రస్ట్ భాద్యతలు చేపట్టిన అనంతరం అశోక గజపతి రాజు ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపారు. అప్పటి నుండి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, అశోక్‌గజపతిరాజుపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. అశోక గజపతి రాజు ఒక దొంగ అని, ఆయనపై ఫోర్జరీ కేసు ఉందని త్వరలో ఆయన జైలుకు వెళ్ళటం తప్పదన్నట్లుగా విజయసాయి మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే అశోక్‌గజపతి రాజుపై … విజయసాయి, మరికొందరు పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని వెంటనే వారిని అదుపులో పెట్టాల‌ని లేఖ‌లో సీఎంకు విజ్ఞ‌ప్తి చేశారు. లేదంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో భావోద్వేగాలు చెలరేగి 2014 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పునరావృతం అవుతాయేమోనని తాను భయపడుతున్నట్లుగా రఘురామ పేర్కొన్నారు.