ఎంపీ రఘురామకృష్ణరాజుకు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మధ్యన ఇన్నాళ్ళు నడిచిన ఓపెన్ ఫైట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఏ దశలోనూ రఘురామరాజును లొంగదీయలేకపోయిన వైసీపీ అధిష్టానం అనర్హత వేటు వేయించాలని చూసినా ఫలితం దక్కలేదు. ఇక చేసేది లేక లోక్ సభలో ఆయన సీటును వెనక్కి మార్చి ఆనందపడ్డారు. దాని మీద కూడా రాఘురామరాజు సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం అంటూ సమర్థించుకున్నారు. దీంతో వైసీపీ నేతల్లో ఆర్ఆర్ఆర్ మీద కోపం తగ్గలేదు.
తాజాగా గోసంరక్షణ గురించి మాట్లాడుతూ గోశాలలను సంరక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీనిపై వైసీపీ నేత రాజీవ్ కృష్ణ స్పందిస్తూ మీకు ‘మన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గోవుల సంరక్షణకు కట్టుబడి ఉంది. అయినా ఇది గోవుల మీద ప్రేమా లేకపోతే గోవులను ప్రేమించే వారి(మిమ్మల్ని తిరిగి ప్రేమించేవారు లేక ప్రేమించనివారు) మీద ప్రేమా’ అంటూ సెటైర్ వేశారు. దీంతో రాఘురామరాజు కూడా గట్టిగానే స్పందించారు. అది కూడా తనదతనదైన స్టైల్లో రివర్స్ కౌంటర్ ఇస్తూ.
రాజీవ్ క్రిష్ణా.. గోమాతలను సంరక్షించడం మనందరి బాద్యత అంటూ మీరు నాకు సర్కాస్టిక్ రిప్లై ఇచ్చి ఎవరి పట్ల అయితే మీ ప్రేమను ప్రదర్శించాలని అనుకున్నారో వారు ఇంప్రెస్ కావచ్చు కాకపోవచ్చు లేదా మిమ్మల్ని తిరిగి ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు రాఘురామరాజు మీద ఇంకా కోల్డ్ వార్ నడుస్తూనే ఉందా, అయినా రాఘురామరాజు మీద కౌంటర్ వేసి తప్పించుకోవడమా అంటూ సదరు నేతను ఉద్దేశించి జాలిపడుతున్నారు.