వైసీపీ పార్టీ తరుపున గెలిచి అదే పార్టీకి రెబల్ గా మారిపోయిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తాను ఎంపీ గా రాజీనామా చేస్తే జరగబోయే ఉప ఎన్నికల్లో తనదే విజయమని ధీమాగా చెప్పటం వెనుక రఘురామ కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది. ఉప ఎన్నికల్లో అమరావతి రెఫరెండం మీద నేను ఎన్నికలకు వెళ్తే, అందులో కచ్చితంగా తాను గెలుస్తాడని , జగన్ అమరావతి విషయంలో మోసం చేసాడు కాబట్టి ప్రజలు ఆయనకే ఓట్లు వేస్తారని, అదే సమయంలో అమరావతికి మద్దతు ఇచ్చే పార్టీలన్నీ తనకు మద్దతు ప్రకటిస్తే ఇక విజయం ఖాయమనే భ్రమలో రఘురామ ఉన్నట్లు తెలుస్తుంది.
ఎప్పుడు ఎన్నికలు జరిగిన తనకు రెండు లక్షల మెజారిటీ వస్తుందనే ధీమాతో ఆయన వున్నారు, మొన్నటి ఎన్నికల్లో ఆయనకు వచ్చిన ఓట్లు 4 లక్షల 47 వేలు, టీడీపీ అబ్యర్దికి వచ్చిన ఓట్లు 4 లక్షల 15 వేలు,అంటే కేవలం 30 వేల మెజారిటీతో మాత్రమే రఘురామ గెలిచాడు. అదే సమయంలో మిగిలిన పార్లమెంట్ లో వైసీపీ తరుపున గెలిచిన వాళ్ళకి సరాసరి 2 లక్షల మెజారిటీ వచ్చింది. వైసీపీ గాలి బలంగా వీస్తున్న సమయంలో కూడా రఘురామ కు ముక్కి మూలిగి కేవలం 30 వేలు మెజారిటీ అంటే ఎంత తక్కువే అర్ధం చేసుకోవచ్చు, జనసేన లేకుండా ఉంటే అక్కడ పరిస్థితి మరోలా ఉండేది అనే వాదన లేకపోలేదు.
ఇంకో విషయం ఏమిటంటే తనకు వచ్చిన ఓట్లు మొత్తం మీద 2 లక్షల దాక కేవలం తన బొమ్మ చూసే వేశారని రఘురామ అంటున్నాడు. ఇక రఘురామ మాటలు గమనిస్తే ప్రతిపక్షాలు అన్ని కలిసి తనను ఉమ్మడి అబ్యర్థిగా నిలబెడితే తనకు విజయం తధ్యమని భావిస్తున్నాడు, కానీ అది జరిగే పని కాదని తెలుస్తుంది. ఒక వేళ టీడీపీ మద్దతు ఇచ్చిన కానీ టీడీపీని చూసి బీజేపీ జనసేన మద్దతు ఇచ్చే అవకాశం కూడా లేదు. రఘురామ విషయంలో బీజేపీ కూడా అంటీముట్టనట్లే వ్యవహరిస్తోంది, కాబట్టి విపక్షాల ఉమ్మడి అబ్యర్థి అనేది కష్టమైన పనే… ఇన్ని ప్రతికూలతలు కనిపిస్తున్న కానీ రఘురామ ఎన్నికలు జరిగితే నాదే గెలుపు అని చెప్పుకోవటం విశేషం