తెలంగాణలో అసలైన రాజకీయం దుబ్బాక ఎన్నికల తరువాత మొదలైంది. తెలంగాణ రాజకీయాలను తెలంగాణ ఏర్పడిన తరువాత నుండి రాజకీయాలను సింగల్ హ్యాండ్ తో ఏలుతున్న కేసీఆర్ కు బీజేపీ నాయకులు షాక్ ఇచ్చారు. పక్క ప్రణాళికతో టీఆర్ఎస్ కు బీజేపీ నాయకులు చుక్కలు చుపించారు. కేసీఆర్ పాలనలో ఉన్న లోపాలను ప్రజలకు చెప్తూ, కేసీఆర్ ను తాము ఎలా అడ్డుకుంటామో చెప్తూ దుబ్బాక ఎన్నికల్లో రఘునందన రావు 1470 ఓట్లతో విజయాన్ని సాధించారు. అయితే ఎన్నికల తరువాత మరో పథకంతో బీజేపీ నాయకులు కేసీఆర్ కు చుక్కలు చూపించడానికి సిద్ధమయ్యారు.
దుబ్బాక ఎన్నికల్లో నాటకీయ సంఘటనలు
దుబ్బాక ఎన్నికల సమయంలో చాలా నాటకీయ పరిణామాలు చోటు చూసుకున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు సిద్దిపేటలో రఘునందన్ మామ అంజన్‌రావు ఇంట్లో సెర్చ్ చెయ్యగా, రూ.18.67 లక్షలు పట్టుపడ్డాయని, వీటిలో రూ.12.80 లక్షలను రఘునందన్ అనుచరులు ఎత్తుకెళ్లారని, వారిలో 30 మందిని గుర్తించా మని, కేసులు నమోదు చేస్తామని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో రఘునందన్ న్యాయపరమైన అంశాలపై దృష్టి మళ్లించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టి వేయాలంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇంట్లో రూ.18 లక్షలు దొరికాయని పోలీసులు కట్టు కథ అల్లారని రఘునందన్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారిస్తుందని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ పేర్కొంది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు.
కేసీఆర్ రాజకీయం ముగిసిందా!!
ఇప్పటి వరకు తెలంగాణలో కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొన్న పార్టీ కానీ నాయకులు గాని లేరు. ఇప్పటి వరకు తమకు కాంగ్రెస్ మాత్రమే రాజకీయ శత్రువు అనుకున్నారు కానీ బీజేపీతో కేసీఆర్ ఉలిక్కిపడ్డారు. ఆల్రెడీ టీఆర్ఎస్ గెలిచిన స్థానంలో గతంలో అదే స్థానంలో ఓడిపోయిన రఘునందన్ రావు విజయాన్ని సాధించారు.
దుబ్బాక పక్కన సిద్దిపేటలో హరీష్ రావు, గజ్వెల్ లో కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా దుబ్బాక ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. దుబ్బాక ఎన్నికల్లో వచ్చిన విజయంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటనుందని, బీజేపీని ఇప్పుడే కేసీఆర్ కట్టడి చెయ్యకపోతే రానున్న రోజుల్లో కేసీఆర్ రాజకీయ జీవితం ముగియనుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.