Actor Harsha vardhan: రాఘవేంద్ర రావు గారికి కథ చెప్తే పక్కకి పిలిచి గట్టిగా క్లాస్ ఇచ్చారు: నటుడు హర్షవర్ధన్

Actor Harsha vardhan: తానంటే దర్శకుడు రాజమౌళి గారికి చాలా ఇష్టం అని, డైరెక్టర్ గా తాను అంటే చాలా అభిమానం చూపించే వారని నటుడు హర్షవర్ధన్ తెలిపారు. అప్పట్లో కస్తూరి సీరియల్ చాలా హిట్ కావడంతో తనకు రాజమౌళి పరిచయం అయ్యారని ఆయన తెలిపారు. వారిద్దరూ కలిసి శాంతినివాసం సీరియల్ కోసం కలిసినపుడు మీ కస్తూరి సీరియల్ ఎపిసోడ్ లు అన్ని చూశాను అని, చాలా బాగున్నాయి అని తనను మెచ్చుకున్నట్టు హర్షవర్ధన్ చెప్పారు. తనకు కస్తూరి సీరియల్ ద్వారా రాజమౌళితో పాటు గంగరాజు గారు కూడా పరిచయం అయ్యారని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

గంగరాజు గారు గురించి తనకి ఇంతకుముందు తెలియదని, కానీ ఆ తర్వాత ఆయన గురించి తెలిసినప్పుడు ఇంత గొప్ప ఆ వ్యక్తి చేత తాను ప్రశంసలు అందుకున్నానని, ఇప్పటికీ గర్వంగా ఫీల్ అవుతానని హర్షవర్ధన్ చెప్పారు. తనను శాంతినివాసం సీరియల్ కి స్క్రిప్ట్ రైటర్ గా పెట్టుకున్నారని, కానీ తాను అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా అంటే తన గురువు గారైన రామ్ గోపాల్ వర్మ గారిలా రాసే సరికి అది కొంచెం మోడ్రన్ గా మారిందని హర్షవర్ధన్ చెప్పారు.

ఇకపోతే తాను రాసిన స్క్రిప్ట్ రాజమౌళి గారికి నచ్చింది. కానీ ఇది రాఘవేంద్ర రావు గారికి నచ్చడం అంటే కష్టమే రిస్క్ తీసుకోవాల్సిందే అని ఆయన అన్నట్టు హర్షవర్ధన్ చెప్పారు. ఆ తర్వాత తాను రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్లి స్టోరీ ఎంత చెప్పగానే ఆయన పక్కకు తీసుకెళ్లి క్లాస్ పీకారని హర్షవర్ధన్ అన్నారు. బాబూ నేను చాలా సున్నితమైన మనసున్న వాణ్ని. నువ్విలా బీభత్సమైన సీన్లు చెప్తే కుదరదు అందులోనూ టీవీకి. నాకు తెలిసి నువ్వు రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ అనుకుంటా నువ్వు అని ఆయన అడిగారని హర్షవర్ధన్ చెప్పారు. అవును అని తాను చెప్పే సరికి దానికి సమాధానంగా ఆయన ఆర్జీవీ సినిమాలు ఇలా గుండె పైన చెయ్యి వేసుకుని చూస్తాను భయంతో.. అని జవాబు చెప్పినట్టు హర్ష తెలిపారు. తన మైండ్ సెట్, ఆయన మైండ్ సెట్ ఒకేలా లేదని, వీలైతే మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రై చేద్దామని ముఖం మీదే చెప్పినట్టు హర్ష ఉన్నారు. కానీ తనకు రాఘవేంద్ర రావు గారితో ఛాన్స్ మిస్ చేసుకోవడం ఇష్టం లేక చాలా ప్రయత్నించాను. కానీ అది జరగలేదని, వాళ్లు ఆ తర్వాత వేరే రైటర్స్ తో రాయించుకున్నారని హర్షవర్ధన్ వివరించారు.