Radhe Shyam: రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ… సినిమా ఎలా ఉందో చెప్పేసిన ఉమైర్ సంధు!

Radhe Shyam: రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ పూజ హెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఒమీ క్రాన్ కారణంగా వాయిదా పడపోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి .ఇప్పటికే రాజమౌళి సినిమా వాయిదా పడగా త్వరలోనే ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని పెద్దఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా దుబాయ్ లో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉమైర్ సంధు ఈ సినిమాని దుబాయిలో వీక్షిస్తున్నట్లు తెలియజేశారు. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఈయన కేవలం ఒకే ఒక ట్వీట్ ద్వారా ఈ సినిమా రివ్యూ ఇచ్చేశారు. రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ కన్నా ఎంతో అద్భుతంగా ఉందని ఈయన తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ ఎలాంటి క్లాస్ విజువల్ వండర్ గా ఉందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా ట్రైలర్ కన్నా ఎంతో అద్భుతంగా ఉందని చెప్పడంతో ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన పరోక్షంగా ఈ సినిమా రివ్యూ ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల అవుతుందా లేదా అనే విషయం పై మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అభిమానులు ఎంతో సందిగ్ధంలో ఉన్నారు.