‘కేజీఎఫ్ 2’ తరహా కాదు మించే “రాధే శ్యామ్” టీజర్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వస్తుంది. ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” నుంచి రేపు ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ టీజర్ రిలీజ్ కి ముందు దీనిపై మరిన్ని ఆసక్తికర అంశాలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన టీజర్ వీడియోస్ లో “కేజీయఫ్ 2” వారు కాస్త వినూత్నంగా ఆలోచించి అన్ని భాషలకు కలిపి ఓకే వీడియోని రిలీజ్ చెయ్యగా ఇప్పుడు రాధే శ్యామ్ టీజర్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

కేజీయఫ్ లానే సింగిల్ టీజర్ గా ఉండొచ్చని, కాకపోతే మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్ లో ఆయా భాషల సబ్ టైటిల్స్ లో విడుదల కాబోతుందట అంటే హాలీవుడ్ ఆడియెన్స్ ని కూడా టార్గెట్ చేసుకొనే ఈ టీజర్ వస్తుంది అని చెప్పొచ్చు.