Radhe Shyam Run Time : “రాధే శ్యామ్” తెలుగులో ఇంత చిన్న సినిమానా? నిడివి లీక్ అయ్యింది.!

Radhe Shyam Run Time

Radhe Shyam Run Time : ఇక ఈ నెల నుంచి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సినిమాల జోరు కనిపిస్తుంది. మొదటగా సూర్య నటించిన చిత్రం “ఈటి” తో మొదలుకొని పాన్ ఇండియా లెవెల్లో మన సౌత్ ఇండియా సినిమాలు తమ సత్తా చాటనున్నాయి. ఇక ఇదిలా ఉండగా సూర్య సినిమా తర్వాత హిందీ మార్కెట్ లో భారీ స్థాయిలో ప్రభావం చూపగలిగే మొదటి సినిమానే “రాధే శ్యామ్“.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ భారీ సినిమా ఈ మార్చ్ 11న రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి గాను మేకర్స్ రెండు మూడు రకాల వెర్షన్స్ ని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. మరి ఇపుడు ఈ భారీ సినిమా తెలుగు నిడివి లీక్ అయ్యినట్టు తెలుస్తుంది.(Radhe Shyam Run Time)

దీని ప్రకారం ఈ సినిమా తెలుగులో కేవలం 138 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. అంటే సుమారు సినిమా కేవలం 2 గంటల 18 నిమిషాలే అనమాట. ఇది కాస్త షార్ట్ రన్ టైం అనే చెప్పాలి. ఇప్పటికే వచ్చిన సరికొత్త ట్రైలర్ తో ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

దీనితో సిల్వర్ స్క్రీన్ పై ఈ సినిమాని చూడటానికి ఆడియెన్స్ చాలా ఉవ్విళ్లూరుతున్నారు. మరి దర్శకుడు రాధా కృష్ణ ఏం చేసాడో చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించగా, రెబల్ స్టార్ కృష్ణ రాజు, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా యూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మాణం వహించారు.