Radhe Shyam : బిగ్ న్యూస్ : “టైటానిక్”ని మించి “రాధే శ్యామ్” క్లైమాక్స్..ఆస్కార్ విన్నర్ మాటలు.!

Radhe Shyam : ప్రపంచ స్థాయి సినిమా దగ్గర కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన చిత్రాల్లో హాలీవుడ్ వండర్ చిత్రం “టైటానిక్” కూడా ఒకటి. దర్శకుడు జేమ్స్ కెమరూన్ అద్భుత రూపకల్పనలో దిద్దుకున్న ఈ ప్రేమ కథా చిత్రం కలెక్ట్ చేసిన వసూళ్లు అయితే ఇప్పటికీ కూడా ప్రపంచంలోనే టాప్ 3 లో నిలిచింది.
మరి అలాంటి ఈ భారీ సినిమాని మించి తమ సినిమా ఉంటుందని “రాధే శ్యామ్” మేకర్స్ చెప్పడం ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ అంశంగా నిలిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన భారీ సినిమా కూడా అద్భుతమైన ప్రేమ కథ పైగా ఇందులో కూడా మైండ్ బ్లోయింగ్ షిప్ సీక్వెన్స్ కూడా ఉందని తెలిసిందే.
అయితే టైటానిక్ చిత్రంలో క్లైమాక్స్ ఎంత కీలకంగా కనిపిస్తుందో తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ క్లైమాక్స్ ని మించే లెవెల్లో రాధే శ్యామ్ ఉండబోతుంది అని రాధే శ్యామ్ కి వర్క్ చేసిన ఆస్కార్ విన్నర్ అంటున్న మాట.
ఈ సినిమాకి సౌండ్ మిక్సింగ్ లో మన ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు అందుకున్న రెసూల్ నిన్న ఈ సినిమా కొత్త ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ ఈ సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడం జరిగింది. దీనితో ఈ టాక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మరి నిజంగానే రాధే శ్యామ్ క్లైమాక్స్ ఆ లెవెల్లో ఉంటుందా లేదా తెలియాలి అంటే ఈ మార్చ్ 11 వరకు ఆగక తప్పదు.