“స్పిరిట్” లానే “రాధే శ్యామ్” అదిరే రిలీజ్ ప్లానింగ్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే భవిష్యత్తు ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియన్ నుంచి పాన్ ఆసియన్ హీరోగా ప్రభాస్ స్థిరపడనున్నాడు. అయితే ఈ అడుగు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో ప్లాన్ చేసిన “స్పిరిట్” తో అనుకున్నారు. ఏకంగా ఈ సినిమాని 8 భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చెయ్యడంతో ఇది మంచి హాట్ టాపిక్ అయ్యింది.

కానీ అందులో మరో రెండు భాషలతో ముందు రాధే శ్యామ్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. రాధే శ్యామ్ ని తెలుగు, హిందీ, తమిళ్, మళయాళ, కన్నడ భాషల తోనే కాకుండా జపాన్, చైనా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారట. ఇది మరింత ఇంట్రెస్టింగ్ విషయం అని చెప్పాలి. అది కూడా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే జనవరి 14న ఒకేసారి ఈ విడుదల ఉంటుందని సమాచారం. ఓవరాల్ గా మాత్రం స్పిరిట్ కన్నా ముందే ప్రభాస్ అడుగు పాన్ ఆసియన్ లెవెల్లో పడుతుంది..