OTT Offers: బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించిన తర్వాత ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా నిర్మాణ పనులు అన్ని పూర్తిచేసుకుని ఈనెల 14వ తేదీ సంక్రాంతి కానుకగా ప్రజల ముందుకు తీసుకు రావాలని సినిమా యూనిట్ నిర్ణయించుకున్నారు. కానీ కరోనా మొదటి వేవ్ సమయంలో ఇండస్ట్రీలో సంక్షోభం నెలకొని పెద్ద పెద్ద సినిమాలు సైతం ఓటిటిలో విడుదల చేశారు . ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతుండటం వల్ల చాలా సినిమాలు ఓటీటీలో విడుదల చేయటానికి సన్నద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాకి కూడా ఓటీటీ చాలా ఆఫర్స్ ఇస్తోంది.
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. సాహో రిలీజ్ అయిన రెండేళ్ల తర్వాత రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా కోసం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14 వ తేదీన సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం వల్ల ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా మా వాయిదా గురించి దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు.
ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమాకు అదిరిపోయే ఓటిటి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఈ సినిమాకు 350 కోట్ల ఆఫర్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ కూడా ఈ చిత్రానికి 300 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై నిర్మాతలు స్పందించలేదు.ప్రభాస్ లాంటి హీరో సినిమాను ఓటిటి రిలీజ్ చేస్తే ఆ విషయం చాలా సంచలనంగా మారుతుంది.