Radhe Shyam Final Theatrical Business : “రాధే శ్యామ్” ఫైనల్ థియేట్రికల్ బిజినెస్, థియేటర్స్ కౌంట్ వివరాలు ఇవే.!

Radhe Shyam Final Theatrical Business

Radhe Shyam Final Theatrical Business : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తే ఇప్పుడు దానికి ఉండే హైప్ వేరు మరి ఇప్పుడు అలాగే భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి వస్తున్న భారీ సినిమానే “రాధే శ్యామ్“.

గతంలో బాహుబలి, సాహో ల తరహాలోనే అనేక ఏళ్ల నిరీక్షణల అనంతరం ఈ సినిమా కూడా రేపు మార్చ్ 11న రిలీజ్ కాబోతుంది.

అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై అనేక ఊహాగానాలు వినిపించినా ఇపుడు ఫైనల్ గా అయితే ఈ సినిమా తాలూకా ఫైనల్ లెక్కల వివరాలు తెలుస్తున్నాయి.

మొదటగా ఈ సినిమా కేవలం థియేట్రికల్ బిజినెస్ కోసం చూసినట్టు అయితే ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి “రాధే శ్యామ్” కేవలం 202 కోట్లు మాత్రమే చేసిందట.

ఇది ఒకింత తక్కువే అని చెప్పాలి ప్రభాస్ నటించిన లాస్ట్ సినిమా “సాహో” 250 కోట్లకి పైగా బిజినెస్ ని జరిపింది. ఇక థియేటర్స్ కౌంట్ విషయానికి వస్తే ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో రిలీజ్ అని టాక్ వచ్చినా హిందీ, తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో టోటల్ కౌంట్ గా 8 వేల థియేటర్స్ లోపు ఈ సినిమా విడుదల అవుతుందట.

ఇది కూడా ఒకింత తక్కువే అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా రాధా కృష్ణ సంగీతం అందించాడు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహించారు.