జగన్ ప్రభుత్వాన్ని ఇరికిద్దాము అనుకున్న ఏబిఎన్ ఆర్కే – హైకోర్టు లో తానే ఇరుకున్నాడా?

Weekend Comment by RK

రాజకీయ నాయకులు చేసే ఎన్నో ఆరోపణల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి. ఈ ఆరోపణలకు ఆధారాలు ఉండవు, ఏమి ఉండవు. కొంతమంది నాయకులు నోటికి ఏది వస్తే అది వాగుతారు. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే విషయం వైరల్ అవుతుంది.కానీ ఈసారి దాని డోస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంది.
ఏబీఎన్ RK చేసిన ఆరోపణలు నిజం అవుతున్నాయా?
ఈ వ్యవహారం మొత్తం మాజీ జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్స్ బయటకు వచ్చిన తరువాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాసింది. దీని తరువాత ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీకి లేఖ రాశారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతుందని శ్రవణ్ కుమార్ అనే న్యాయవాది కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సర్కార్ .. ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా అధికారిని నియమించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ అధికారి పేరు చెప్పాలని ధర్మాసనం శ్రావణ్ కుమార్‌ను కోరింది. అయితే ప్రత్యేకంగా అఫిడవిట్ దాఖలు చేస్తానని శ్రావణ్ కుమార్ చెప్పారు. రాజకీయ నాయకుల మాదిరిగా న్యాయమూర్తులకు కూడా షాడో పార్టీలను నియమించారని శ్రవణ్ కోర్టుకు తెలిపారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల ఇరవయ్యో తేదీకి విచారణకు వాయిదా వేసింది.

వాదనలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది విచారణ అవసరం లేదన్నట్లుగా వాదిస్తూండటంతో విచారణ జరిపితే మీకు ఇబ్బందేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌లో న్యాయదేవతపై నిఘాపేరుతో కథనం రాసిన ఆంధ్రజ్యోతిని కూడా పార్టీని చేయాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం పిటిషన్ లో ఆంధ్రజ్యోతిని కూడా ఇంక్లుడు చేస్తే రాధాకృష్ణ ఇరకాటంలో పడతాడాని, ఎందుకంటే అతను ఆ కథనం రాసింది కేవలం ఊహాగానాల ఆధారంగా అని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరికించడానికి ప్రయత్నం చేసిన ఆర్కే, చివరికి తానే ఇరకాటంలో పడ్డాడు. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదని, అది ఎవరి విషయంలో జరిగినా కూడా తప్పేనని హై కోర్ట్ తెలిపింది.